ప్రధానికి మోడీకి ప్రతిపక్షాల పంచ్..?

0
78

Posted April 22, 2017 at 10:31

opposition parties plan to alliance against bjpదేశంలో పరిస్థితుల్ని బట్టి చూస్తే ప్రధాని మోడీకి తిరుగులేదు. అయితే ప్రతిపక్షాలన్నీ కలిసి ఏదో రకంగా కేంద్రానికి షాకివ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019లో మోడీ హవాకు బ్రేకేయాలంటే అందరూ కలిసి కూటమి ఏర్పడాలని అంటున్నారు బీజేపీయేతర సీఎంలు, కానీ అది ఎంతవరకు సాధ్యమనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.. ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నా.. ఆ అధినేతలంతా నాయకత్వం కోసం కొట్టుకుంటారు. అందుకే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా నాయకత్వం వహిస్తే అందరూ కలిసొస్తారని భావిస్తున్నారు.

ఈ విషయంపై ఇప్పటికే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చర్చలు జరిపారు. ఎందుకంటే బీజేపీ తర్వాతి టార్గెట్ స్టేట్స్ ఈ రెండే ముందున్నాయి. ఒడిషాలో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతుండగా, బెంగాల్ సీఎం కూడా కమలం గుబులు వెంటాడుతోంది. ఎందుకంటే మోడీ హయాంలో బీజేపీ చాలా రాష్ట్రాల్లో అనూహ్య విజయాలు సాధిస్తోంది. అందుకని ఇప్పటి ఓట్లశాతాన్ని లెక్కేసుకుంటే దెబ్బేస్తారని సీఎంలు భయపడుతున్నారు. తమ కుర్చీ కిందకు నీళ్లు రాకముందే మేలుకోవాలని చూస్తున్నారు.

కానీ ప్రాంతీయ పార్టీల కూటమి ఎక్కువకాలం నిలవదని గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే జాతీయ పార్టీ కాంగ్రెస్ ను లీడ్ తీసుకోవాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే కోరారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి కూడా పెద్ద బాగోలేదు. అలాంటప్పుడు ఆ పార్టీ ముందుకొస్తుందా అనేది అర్థం కావడం లేదు. ఓవైపు బీజేపీ వల్ల తమకు ముప్పేమీ లేదని చెబుతున్న మమత.. కూటమి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అటు బీజేపీ నేతలు కూడా కూటమి ప్రయత్నాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు.