ప్రభాస్ సినిమా ముద్దు … సల్మాన్ సినిమా వద్దు

0
111

 Posted May 2, 2017 at 18:13

pakistan demand to releasing bahubali movie but salman tubelight movie not accept thereప్రభాస్ బాహుబలి ది కంక్లూజన్ మూవీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోని రికార్డ్స్ ని తిరగరాసేస్తోంది. విడుదల అయిన ప్రతి చోట పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఇప్పుడు ఈ మూవీ పై పాకిస్తాన్ కన్ను పడింది.బాహుబలి మూవీ ని తిలకించే అవకాశం కావాలని, ఈ మూవీ ని పాక్ లో కూడా విడుదల చేయాలని అడుగుతున్నారు అక్కడి జనాలు. పాక్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇదే కోరుతున్నారు.

కానీ ఇదే పాకిస్తాన్ నుంచి సల్మాన్ ఖాన్ కు మాత్రం చుక్కెదురవుతోంది. సల్మాన్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ట్యూబ్ లైట్.. ఈ మూవీ ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజున పాకిస్తాన్ లో కూడా ట్యూబ్ లైట్ మూవీ ని విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే.. అదే సమయానికి అక్కడ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ రెండు సినిమాలు సల్మాన్ తో పోటీ పడగలిగే స్థాయి వాటికి లేదు.అందుకే రంజాన్ రోజున పాక్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని.. ట్యూబ్ లైట్ విడుదలను అడ్డుకోవాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. ఈమేరకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు పాక్ డిస్ట్రిబ్యూటర్లు లేఖ రాయడం విశేషం. బాహుబలి2 విడుదల చేయాలని కోరుతున్న పాక్, సల్మాన్ ఖాన్ సినిమాకి మాత్రం అడ్డుపడుతున్నారు…