తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన పళని

Posted February 16, 2017

Palaniswamy sworn-in as Tamil Nadu chief ministerఎట్టకేలకు తమిళనాడులో రాజకీయ సంక్షోబానికి పుల్ స్టాప్ పడింది. ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య జరిగిన  ఆధిపత్య పోరులో శశికళ వర్గమే సీఎం స్ధానాన్ని దక్కించుకుంది. పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఆయన ఏర్పాటు చేసిన కేబినెట్ మంత్రులు కూడా బాధ్యతలను చేపట్టారు.

ఇవాళ సాయంత్రం 4.30గంటలకు చెన్నైలోని  రాజ్‌భవన్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు.. పళనిస్వామితో ప్రమాణం చేయించారు. పళని.. జయ కేబినెట్‌లో రహదారులశాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయన తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టారు.  ఆయనతో పాటు 31మంత్రులు సామూహిక ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను చేపట్టారు. కేబినెట్ లో నలుగురు మహిళలకు స్థానం కల్పించిన ఆయన శశికళ మేనల్లుడు  దినకరన్ కు పదవి ఇవ్వకపోవడం గమనార్హం.