నివురు గప్పిన నిప్పు లా తమిళ రాజకీయం ..

Posted December 10, 2016

Panneerselvam senior ministers and functionaries meet Sasikala at Poes gardenతమిళనాడు అధికార పార్టీలో పదవుల పంపకంపై రేగిన పోరు నివురు గప్పిన నిప్పులా ఉంది. తాత్కాలికం గా సమసినట్టు కనిపించినా సైలెంట్ గా అనునూయుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ శుక్రవారం రాత్రి ఐ టీ దాడులే.మొన్న జయలలిత విధేయుడు శేఖర్ రెడ్డి మీద, నిన్న రాత్రి శశికళ అనుచరుడు సి ఎం కుర్చీ కోసం ఆరాట పడిన వారిపైన ఐ టీ దాడులు తిరగటం 20 కోట్లు స్వాధీనం చేసుకోవడం చక చక జరిగి పోయాయి..అంతే కాదు తాజా గా జయలలిత రాజకీయ వారసులుగా ముందుకొచ్చిన వారంతా శుక్రవారం రాజీ కి వచ్చినట్టు కనిపిస్తున్నా ఏది ఎంతవరకు నిజమో తెలియదు

పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ తీసుకొనేలా, అందుకు ప్రతి ఫలం గా ఆమె వర్గానికి పార్టీలో పెద్ద పీట వేసేలా..ఒప్పందం. పోయెస్ గార్డెన్ లో సమావేశం ముగిశాక, పన్నీర్‌సెల్వం, శశికళ తదితర నేతలంతా మెరీనాబీచ్‌లోని జయ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు.

చిన్నమ్మ శాంతించడంతో, శనివారం తొలి మంత్రివర్గ సమావేశాన్ని పన్నీరు సెల్వం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో జయలలిత స్నేహితురాలు శశికళ పెట్టిన పేచి..స్వయంగా సీఎం పన్నీరుసెల్వం దౌత్యంతో తీరిపోయినట్టేనని భావిస్తున్నారు. పన్నీరు రెండురోజులుగా శశికళతో జరుపుతున్న వరుస సమావేశాల్లో తాత్కాలిక రాజీ కుదిరినట్టు పార్టీ వర్గాల సమాచారం.తాను సీఎం పదవిని ‘త్యాగం’ చేసినందుకు ప్రతిగా ప్రభుత్వంలో తన అనుచరులకు పెద్దపీట వేయాలని ఆమె షరతు పెట్టింది అలాగే, ప్రధాన కార్యదర్శిగా తనను.. పార్టీ కార్యాచరణ మండలి, సర్వసభ్య మండలి సమావేశాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కూడా శశికళ తెగేసి చెప్పింది వాస్తవం ఏమిటంటే ప్రధాన కార్యదర్శికి శశికళ కాక, మరో ముగ్గురు పోటీపడుతున్నారు. కాబట్టి, సర్వసభ్య మండలి సమావేశం ఏర్పాటు చేయాల్సిన పనిలేదని ఆమె చెప్పడంతో సీనియర్లు తలలు పెట్టుకొంటున్నారు సర్వసభ్యసమావేశం నిర్వహిస్తే వందలాదిమంది సభ్యులు ఉండటంతో సారథి ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశముండటమే దీనికి కారణం.

సమావేశం వల్ల సాంకేతికపరమైన సమస్యలు వచ్చే అవకాశముందేమో పరిశీలిద్దామని పన్నీర్‌సెల్వం చెప్పడంతో నేతలంతా అప్పటికి మౌనం దాల్చారు. తమిళనాడు రాజకీయాలలో జోక్యం చేసుకోబోమని జయ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించేందుకు నిరాకరించారు. మొత్తం గా నివురు గప్పిన నిప్పే తమిళ నాడు రాజకీయం అనేది స్పష్టం