నోట్ల రద్దుకు చట్ట బద్ధత..!

Posted December 12, 2016

parliament meetings plan to legal claim on currency banned issueఒక్క నోటిఫికేషన్‌ ద్వారా పెద్ద నోట్లను వెనక్కు తీసుకున్న మోడీ సర్కారు.. రద్దుకు సంబంధించి పార్లమెంటులో చట్టం చేయాలని పావులు కదుపుతోంది. ఆర్బీఐ చట్టాన్ని సవరించాలని, రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది.పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చట్టబద్ధతపై ఇప్పటికే వివిధ కోర్టుల్లో కేసులు నమోదు కావడం, ప్రోసిజర్ పాటించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఇంద్రం ఈ దిశగా కార్య చరణ చేస్తోంది .

1978లో నోట్లను రద్దు చేసినప్పుడు ముందుగా ఆర్డినెన్స్‌ జారీ చేసి ఆ తర్వాత పార్లమెంటులో చట్టం చేశారు. ఇప్పుడు మాత్రం కేవలం నోటిఫికేషన్‌తోనే రాత్రికి రాత్రే చట్టపరంగా నోట్లు చెల్లవని చెప్పేశారు. దీనిని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.అందుకే ఎప్పుడు చట్ట బద్ధత కోసం ముందుకి వెళ్తున్నారు .

‘‘వెయ్యి నోటును డీమానిటైజేషన్‌ అని అనలేం. దానిని రద్దు చేసినట్లే! కేవలం గెజిట్‌ నోటిఫికేషన్‌తో వెయ్యి నోటును ప్రభుత్వం రద్దు చేయలేదు. ఇది చట్టవిరుద్ధమే. ఈ నిర్ణయానికి చట్టబద్ధత లేదు. దీనికి చట్టబద్ధత కల్పించడానికి పార్లమెంటులో చట్టం చేయడం అనివార్యం’’ అని న్యాయ నిపుణులు అంటున్నారు.

పెద్ద నోట్లను హఠాత్తుగా రద్దు చేసి, కీలకమైన ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు, న్యాయవాదులు, కోర్టులు ఇతరత్రా దుకాణాలను మినహాయించలేదని, తద్వారా, ప్రజల ఆరోగ్య, న్యాయ ఇతర ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని కొందరి వాదన . వీరందరి వాదనలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకొంటోందనే చెప్పాలి .