దూకి లాభం ఏంటి …?

Posted November 26, 2016

 

party changing political leaders troublesఅటు తెలంగాణ లో ,ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీలు ఫిరాయించిన ఏం ఎల్ ఏ ల పరిస్థితి ఇది. తాజా గా నియోజక వర్గాల పెంపు లేదని చావు కబురు చల్లగా తెలవటంతో ఇప్పుడు పెదవులని ఆశిస్తున్న వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లాగా తయారైంది .ఇటు ,అటు అధికార పార్టీ అనే ఒక్క సాటిస్ఫాక్షన్ తప్ప వేరే ఏం లేదని వాపోతున్నారు ,ఇదిలా ఉండగా మొన్నామద్య మాజీ టీడీపీ నాయకుడు ప్రస్తుతం తెరాస నాయకుడు ఎర్రబెల్లి టీడీపీ కి వెళ్తున్నారని ఊహ గానాలు వచ్చాయి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా వున్నాయంటే పరిచయం కొద్దీ మాట్లాడిన అది గో పులి అంటే ఇదిగో తోక అనేలా వున్నాయి .

తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు లేదని కేంద్రం స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఆంధ్ర లో టీడీపీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలలో మరింత కలవరం మొదలైంది. నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు లేనందున వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తారా లేదా అన్న ఆందోళన కూడా ఈ ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే తమ నియోజకవర్గాలలో మరింత శ్రమించి పనిచేస్తే తమకే సీటు గ్యారంటీ అని కొందరు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇద్దరు సి ఎం లను నమ్ముకొని వచ్చాం కాబట్టి వచ్చే ఎన్నికల్లోనూ న్యాయం చేస్తారని ఆశాభావము తప్ప మరొకరి లేదు ..