పట్టి సీమ నీరు కృష్ణ డెల్టాకు వచ్చిందోచ్ …

Posted November 26, 2016

Related image

తెలుగు దేశం ప్రభుత్వం , ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రతిష్టాత్మకం గా తీసుకున్న పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు .. వీటిలో పట్టిసీమ ఎట్టి పోతల పధకాన్ని ముఖ్య మంత్రి ప్రారంభించారు ..తాజాగా పట్టి సీమ నుంచిగోదావరి నీరు ఎట్టి పోతల పధకం ద్వారా కృష్ణ డెల్టా కి చేరింది .గోదావరి నీరు రాక తో కృష్ణ గోదావరి సంగమం కానుంది .

క్రిష్ణా డెల్టాకు తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి నీరు పరవళ్లు తొక్కుతోంది. మొత్తం 24 పంపులలో 23 పంపుల ద్వారా రోజుకు 8.142 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తున్నారు.ఆ నీటిని పట్టిసీమ ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోని ఎగువ ప్రాంతాలకూ, కృష్ణా డెల్టాకు అందిస్తున్నారు. తాగునీటి కష్టాలు తీర్చేందుకు వీలుగా కాలువకు సమీపంలోని చెరువులను నింపుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పోలవరం కుడి ప్రధాన కాలువలో జలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో కృష్ణా డెల్టా రైతుల్లో ఆనందం కన్పిస్తోంది. పట్టిసీమ పథకం నదుల అనుసంధానానికి ప్రత్యక్ష ఉదాహరణ.