బాబు గుండెల మీద పవన్ కుంపటి..

 Posted November 2, 2016

pavan becomes anti to chandrababu
టీడీపీ అన్నా ..చంద్రబాబు అన్నా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కి ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ..ఇది ఏపీ రాజకీయాల్ని దగ్గరగా చూస్తున్న వాళ్ళు చేసే వ్యాఖ్య.వైసీపీ లాంటి పార్టీకి ఇదో విమర్శనాస్త్రం కూడా. అయితే పవన్ తాజా నిర్ణయం ఆ వ్యాఖ్యలకి చెక్ పెట్టేదిగా వుంది.అదే అయన తన కార్యక్షేత్రాన్ని ఏలూరుగా ఎంచుకోవడం. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలో వచ్చిన ఫలితాలు చూసి బాబు పొంగిపోయారు.ప్రత్యర్థికి నిలువనీడ లేకుండా చేసిన అక్కడి ఓటర్లకు పదే పదే అయన కృతజ్ఞతలు చెప్పారు. టీడీపీ కి ఆ జిల్లా గుండెకాయ వంటిదని సంబరపడ్డారు. ఇప్పుడు అదే గుండెల మీద కుంపటి పెడతానంటున్నాడు పవన్. పాలకొల్లు నుంచి పవన్ పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.అదే జరిగితే మారే సామాజిక సమీకరణాలు ,ఎదురయ్యే రాజకీయ సవాళ్లు బాబుకి బాగా తెలుసు.కంచుకోటలు బలహీనపడితే మిగతా ప్రాంతాల్లో దాని ప్రభావం ఎంతలా ఉంటుందో అంచనా వేయొచ్చు.
ఇలా ఏ కోణం లో చూసినా పవన్ ఏలూరు రాక నిర్ణయం బాబు గుండెల మీద కుంపటే.అయితే దీనిలోనూ ఓ రాజకీయ వ్యూహం వుండే అవకాశం లేకపోలేదు. దేశం వ్యతిరేక శక్తులు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ చెంత చేరకుండా జనసేన ఓ ప్రత్యామ్న్యాయ మజిలీగా ఉపయోగపడొచ్చు. చివరిలో టీడీపీ,జనసేన మధ్య ఎన్నికల అవగాహన కుదిరితే అంతా సర్దుకుపోవచ్చు.ఇదంతా జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము ..అంతే కచ్చితంగా జరగదని కూడా చెప్పలేము.ఔనా ..కాదా?