మెగా ఫాన్స్ ఉత్సాహానికి పవన్ బ్రేక్..

Posted February 13, 2017

pavan break to chiru fans
ఎలా ఉంటుందో..ఆ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని ఊహల్లో తేలిపోతున్న మెగా ఫాన్స్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ వేశాడు.మెగా స్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెన్సషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తాను,అశ్వనీదత్ నిర్మాతలుగా ఓ సినిమా తీయబోతున్నట్టు ప్రముఖ రాజకీయ నేత ,ఒకప్పటి భారీ ప్రొడ్యూసర్ టి.సుబ్బిరామి రెడ్డి ప్రకటించారు. మా ఇంటికొచ్చిన త్రివిక్రమ్ తో ఇదే విషయం మాట్లాడానని టీఎస్సార్ చెప్పగానే మెగా ఫాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఈ ఉత్సాహం ఎక్కడి దాకా వెళ్లిందంటే మెగా బ్రదర్స్ సినిమా స్టోరీ ఎలా వుంటుందనే చర్చ దాకా.అయితే ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.అమెరికా పర్యటనలో వున్న ఆయన బోస్టన్ లో ఈ విషయం మీద మాట్లాడారు.అన్నయ్య తో కలిసి సినిమా చేసే ఆలోచన ఇప్పటికి లేదని చెప్పేసారు.హడావిడి ప్రకటనతో రచ్చరచ్చ చేసిన టీఎస్సార్ గాలి తీయడమే కాకుండా మెగా ఫాన్స్ ఉత్సాహం మీద నీళ్లు చల్లారు.