డిప్రెషన్ తో సూసైడ్ చేసుకుందామనుకున్నా: పవన్

Posted February 13, 2017

pavan decided to do sucide in depressionపవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ప్రస్తుతం ఈ పేరు ఓ మేనియాలా మారింది. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఎంతో పట్టుదలగా, సిన్సియర్ గా దూసుకుపోతూ చాలామంది యువతకి స్పూర్తిగా నిలుస్తున్నాడు. పవన్ మీద సిని అభిమానులతో పాటు రాజకీయ అభిమానులు కూడా చాలానే హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు చెప్పినదంతా కేవలం పవన్ ప్రజెంట్ సిట్యువేషన్. అయితే  సినిమాల్లోకి రాకముందు పవన్ కండిషన్ వేరు. చాలా డిప్రెషన్ లో ఉండేవాడట. ఒకానొక టైంలో సూసైడ్ కూడా చేసుకుందామనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా పవనే చెప్పాడు.

ఇండియన్ కాన్ఫరెన్స్ 2017 సందర్భంగా,  హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రసంగించిన పవన్ ఈ విషయాలను చెప్పుకొచ్చాడు. దాదాపు గంటసేపు మాట్లాడిన పవన్.. తన బాల్యం, విద్య, సామాజిక అవగాహన, సినిమాలు, రాజకీయాల్లో తన అనుభవాలను పంచుకున్నాడు.

10th క్లాస్ నుండి ప్రతి క్లాస్ ఫెయిల్ అవుతూ ఉండేవాడినని చెప్పాడు. పుస్తకాల్లో చదివేది ఒకటి..సమాజంలో జరిగేది ఇంకోటి.. ఏది నిజమో చెప్పేవారు లేక తానెంతో మానసిక క్షోభను అనుభవించానని తెలిపాడు. ఈ డిప్రెషన్ వల్ల అన్నయ్య చిరు దగ్గర ఉన్న లైసెన్డ్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని చాలా సార్లు భావించానన్నాడు. వాటిల్లో ఏ ఒక్కటి సక్సెస్ అయినా తానిక్కడ నిలబడి ఉండేవాడిని కాదని, అశేష ప్రేక్ష‌కాభిమానంతో వెలిగిపోయే అభిమాన హీరో అయ్యేవాడిని కాదని చెప్పుకొచ్చాడు. కాబట్టి చావొక్కటే పరిష్కారం కాదని అక్కడి విద్యార్ధులకు హితబోధ చేశాడు. ఇక జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ.. జనసేన ఎప్పుడూ జాతీయ సమగ్రతకే ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టంచేశాడు.