పవన్ కి అగ్నిపరీక్ష

0
167

 pavan kakinada sabha fire test

పవన్ కాకినాడ సభకు సర్వం సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 9న ఆంధ్రుల ఆత్మగౌరవ సభ పేరుతో జరిగే ఈ సభకు కాస్త అటు ఇటుగా ప్యాకేజ్ ప్రకటన వస్తుందని ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. అయితే ప్రత్యేక హోదా నినాదంతో మళ్ళీ రాజకీయ వేదిక పైకెక్కుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కి ఒప్పుకుంటారా?. కనీసం ప్యాకేజ్, హోదా వల్ల జరిగే లబ్దిలో వున్న తేడాల్ని గుర్తిస్తారా? వాటి గురించి కసరత్తు చేస్తారా? ఈ ప్రశ్నలకు జవాబు రావాలంటే కాకినాడ సభ దాకా వేచి చూడాల్సిందే.

తిరుపతి సభ సమయంలో ఇలాంటి కీలక విషయాలపై పవన్ దృష్టి పెట్టినట్టు కన్పించలేదు. తాజాగా హోదా, ప్యాకేజ్ అంశాలు నిర్ణయాత్మక దశకు చేరాయి. ఈ టైమ్ లో కూడా వాటిపై లోతైన అవగాహనా పెంచుకోకుండా కేవలం రాజకీయ ఉపన్యాసాలకే పరిమితమైతే? హోదా డిమాండ్ కే కట్టుబడితే దాన్ని సాధించడం కూడా క్లిష్టమైన ప్రక్రియే. ఆలా కాకుండా ప్యాకేజ్ కి సానుకూల సంకేతాలు పంపితే రాజకీయ ప్రత్యర్ధులు విరుచుకుపడటం ఖాయం. రెండు విపుల రెండు రకాల ప్రమాదాలు పొంచి వున్న ఈ పరిస్థితుల్లో కాకినాడలో జరిగే ఆంధ్రుల ఆత్మగౌరవ సభ … పవన్ కి అగ్నిపరీక్ష సభ కానుంది.