అన్న ఎన్టీఆర్ బాటలో పవన్ కళ్యాణ్ ..

0
214

pavan kalyan follows senior ntrజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా సొంత అన్న చిరంజీవి కాకుండా ఆంధ్రుల అన్న ఎన్టీఆర్ ని ఫాలో అయ్యేందుకు నిర్ణయించుకున్నారా ? ఆవేశం పాళ్ళు ఎక్కువగా,రాజకీయ వ్యూహాలు తక్కువగా వుండే ఎన్టీఆర్ శైలిని పవన్ ఇష్టపడ్డారా? ఈ రెండు ప్రశ్నలకి ఔననే సమాధానం వినిపిస్తోంది. ఒకప్పుడు ఆడువారి మాటలకి అర్ధాలే వేరులే అంటూ అన్న గారి పాటని రీ మిక్స్ చేసి ఖుషీ లాంటి సెన్సషనల్ హిట్ కొట్టిన పవన్ రాజకీయంగానూ అయన బాటలోనే నడవాలనుకుంటున్నారు.

పవన్ ఆలోచనని బలపరుస్తూ జనసేన తరుపున కాకినాడ లో ఏర్పాటు చేస్తున్న సభకి సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ అని పేరు పెట్టారు. ఒకప్పుడు ఇదే ఆత్మగౌరవ నినాదంతో అన్న ఎన్టీఆర్ ఢిల్లీ పెత్తనాన్ని ప్రశ్నించారు ,వారిపై తిరుగులేని విజయం సాధించారు. మళ్లీ పవన్ అదే నినాదాన్ని ఎత్తుకోవడం వ్యూహాత్మకమే కావచ్చు.