కెసిఆర్ ని పవన్ ఇలా డీకొడతాడా?

 Posted November 6, 2016

pawan kalyan to beatout kcr in telangana
జనసేన ఇక ఆంధ్ర పార్టీ అనే అంచనాల్ని తిప్పికొట్టేందుకు పవన్ కళ్యాణ్ తొలి అడుగులేశాడు. తెలంగాణలోనూ పార్టీ విస్తరణపై దృష్టి పెడ్తున్న విషయాన్ని ఆదిలోనే ఖరారు చేశాడు.పార్టీ నిర్మాణం,బాధ్యతల అప్పగింతపై జనసేన తొలి అడుగుల్లో తనతో నడిచిన తెలంగాణ నేతలకి ప్రాధాన్యం ఇస్తూ పవన్ నియామకాలు చేపట్టారు. వేమూరి శంకర్ గౌడ్ ని తెలంగాణ ఇన్ ఛార్జ్ గా, మహేందర్ రెడ్డి ని తెలంగాణలో పార్టీ కార్యక్రమాల సమన్వయకర్తగా నియమించారు.ఈ ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డ వ్యాపారవేత్తలు కావడం విశేషం.అందులో మహేందర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా డి .పోచంపల్లి .ఇక శంకర్ గౌడ్ రాజధాని నడిబొడ్డున ఉన్న బోరబండ. పవన్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించినప్పుడు ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు.
జనసేన తొలి నియామకాలు తెలంగాణ కి సంబంధించి చేయడం ద్వారా తెరాస ని పవన్ ఢీకొట్టడానికే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.గౌడ ,రెడ్డి సామాజిక వర్గాలకు పెద్ద పీట వేయడం ద్వారా తెలంగాణ కుల సమీకరణాలు దృష్టిలో ఉంచుకునే ముందుకెళ్లినట్టు తెలుస్తోంది.బీసీ,రెడ్లకి జనసేన ప్రాధాన్యం ఇస్తుందన్న సంకేతాలిచ్చిన పవన్ అదే కాంబినేషన్ తో కెసిఆర్ సర్కార్ కి సవాల్ విసరాలని భావిస్తున్నారు .
ఇక జనసేన జరిపిన మూడో నియామకం ఆంధ్రాకి సంబందించినది.పి.హరిప్రసాద్ కి పార్టీ మీడియా విభాగం హెడ్ బాధ్యతలు అప్పగించారు.దాదాపు ముప్పై ఏళ్లుగా వివిధ స్థాయుల్లో జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం ఆయనది.కాపు సామాజికవర్గానికి చెందిన హరిప్రసాద్ గతంలో చిరు భాగస్వామిగా ఉన్న మా టీవీ లో న్యూస్ విభాగపు ఇంచార్జి గాను పనిచేశారు.ఇప్పుడు పవన్ అయన సేవల్ని వాడుకోడానికి నిశ్చయించుకున్నారు.