పవన్‌ ఫ్యాన్స్‌ సంతోషం.. రాజమౌళితో సినిమా కారణం

0
101

pawan fans feel happy because rajamouli new movie direction
పవర్‌ స్టార్‌ పవన్‌ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే కాటమరాయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సినిమా పూర్తి కాకుండానే మరో రెండు సినిమాలకు కూడా పవన్‌ కమిట్‌ అయ్యాడు. ఈ సమయంలోనే ‘బాహుబలి’తో పాటు పలు సూపర్‌ హిట్‌ చిత్రాలకు కథలు రాసి, దేశంలోనే నెం.1 స్టోరీ రైటర్‌గా పేరు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్‌ తాను త్వరలో పవన్‌ కళ్యాణ్‌ కోసం ఒక కథను రాస్తాను అంటూ ప్రకటించాడు.

రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాకు కూడా కథలు అందించినది విజయేంద్ర ప్రసాద్‌ అనే విషయం తెల్సిందే. అందుకే పవన్‌ కోసం విజయేంద్ర ప్రసాద్‌ తయారు చేస్తానన్న కథకు కూడా రాజమౌళి దర్శకత్వం వహిస్తాడేమో అనే నమ్మకం మరియు ఆశతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌తో రాజమౌళి సినిమా తీస్తే దుమ్ము దుమ్ముగా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల ప్రభంజనం సృష్టించవచ్చు అనేది మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం. అందుకే మెగా ఫ్యాన్స్‌ ముఖ్యంగా పవన్‌ ఫ్యాన్స్‌ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే వీరి సంతోషం నిలిచేనా, ఇద్దరి కాంబో మూవీ సాధ్యం అయ్యేనా అనేది కాలమే నిర్ణయించాలి.