‘డీజే’కు ఇదో పెద్ద సమస్యగా మారింది

0
93

Posted May 17, 2017 at 13:36

pawan kalyan cief guest for Alluarjun Dj Audio Fucntion
అల్లు అర్జున్‌ చాలా రోజుల క్రితం పవన్‌ కళ్యాణ్‌ విషయంలో నోరు జారిన విషయం తెల్సిందే. అప్పటి నుండి కూడా బన్నీని చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా పవన్‌ ఫ్యాన్స్‌ ఉతికి ఆరేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా దుమ్ము దుమ్ముగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అల్లు అర్జున్‌ను ఏకి పారేస్తున్నారు. బన్నీ ఏ సినిమా వచ్చినా, చిన్న వీడియో వచ్చినా కూడా పవన్‌ ఫ్యాన్స్‌ దానిపై తమ ప్రతాపం చూపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్‌ నటించిన ‘డీజే’ చిత్ర ఆడియో టీజర్‌ విడుదలైంది. దానిపై ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ ప్రతాపం చూపుతున్నారు.

‘డీజే’ టీజర్‌ కోటి వ్యూస్‌ను సొంతం చేసుకుంది అనే సంతోషం కంటే, రికార్డు స్థాయిలో డిస్‌లైక్స్‌ వచ్చాయి అనే బాధ చిత్ర యూనిట్‌ సభ్యులను ఇబ్బంది పెడుతుంది. ఇక తాజాగా విడుదలైన ఆడియో టీజర్‌ కూడా డిస్‌లైక్స్‌ బారిన పడటం జరిగింది. పవన్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఈ టీజర్‌కు డిస్‌లైక్స్‌ కొడుతున్నారు. దాంతో మరోసారి చిత్ర యూనిట్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్థం కాక ‘డీజే’ చిత్ర యూనిట్‌ సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు. పవన్‌తో చెప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్‌ చేతుల మీదుగా ‘డీజే’ ఆడియో విడుదల చేయించేందుకు దిల్‌రాజు తన వంతు కృషి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.