పవన్ రాటుతేలాడా…?

Posted November 10, 2016

pawan kalyan gain maturity level in anantapur meeting
పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు ఆయనో సినీ హీరో ..యువతకి ఐతే ఆయనే ఓ ఇజమ్ …ఇలా చెప్పుకుంటూ పొతే వీడు ఆరడుగుల బుల్లెట్టు అన్నట్టుగానే ఉంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పోకడ… ఆ మధ్య తిరుపతిలో మొన్నే మద్య కాకినాడలో నిర్వహించిన సభల్లో పవన్ మాట్లాడుతున్న తీరు చుస్తే అయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని రాజకీయాల్ని కొంచెం కొంచెం ఔపోసన పడుతున్నట్టుగా కనిపిస్తోంది.సూటిగ తిట్టకుండా గుచ్చినట్టు పవన్ కూడా మాట్లేడేస్తున్నారు. ఆ మధ్య జరిగిన ఒక సభలో అబ్బా ఏం చెపుతున్నాడు రా బాబు అనిపించేలా ఉన్నప్పటి స్ప్పేచ్ కి ఈ రోజు అనంతలో మాట్లాడిన మాటలకి సహస్రం తేడా ఉంది అనే చెప్పాలి. మోడీ అంటే గౌరవం అంటూనే ,టీడీపీ కి ప్రచారం చేశా హక్కుంది అంటూ తాను భవిష్యత్తులో అనుసరించ బోయే విధానాల్ని కుండా బద్దలు కొట్టేసాడు పవన్.

ఇక పార్టీ నిర్మాణం విషయానికొస్తే టీడీపీ సెంటిమెంట్ నే పవన్ అనుసారిస్తున్నారా ..! ఔనేమో ,మొదటి పార్టీ కార్యాలయం,తానూ 2019 లో పోటీ చేస్తాను అనే విషయం మొత్తంగా అయన వ్యూహం  ఏమిటి అనేది కొంత బైట పెట్టారనే చెప్పాలి, అధికారం కాదు సమస్య పరిష్కారం అని చెప్తూ ప్రజలకి చేరువయ్యే ల పవన్ ప్రసంగం సాగింది,ప్రత్యేక హోదా ఎందుకు కావాలి ,ఎందుకు ప్రశ్నించరు, అంటూ సూటి ప్రశ్నలు వేయటం ద్వారా తానూ టీడీపీ కి అనుకూలం కాదు అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు .. మొత్తంగా పవన్ రాజకీయాల్లో పరిణతి సాధించి ప్రజాదరణ పొందుతారో లేదో వేచి చూడాల్సి ఉంది.

[wpdevart_youtube]g9WOvhE6es4[/wpdevart_youtube]