విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన పవన్..!!

Posted February 9, 2017

pawan kalyan going with his wife to america harvard universityపవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తన పవనిజాన్ని  సినిమాల్లోనే కాక రాజకీయాల్లో కూడా ప్రదర్శిస్తూ  ప్రస్తుతం కీలకంగా మారాడు. కాగా అతని ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ కొందరు అతని వ్యక్తిగత జీవితాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. మెగా బ్రదర్స్ మధ్య లొసుగులున్నాయని, అందుకే వాళ్లు సినీ ఫంక్షన్స్ లోనే కాక తమ సొంత ఫంక్షన్స్ లో కూడా కలుసుకోరని విమర్శిస్తుంటారు. దీంతో పాటుగా పవన్ వైవాహిక జీవితంపై కూడా బురద జల్లారు.. జల్లుతూనే ఉన్నారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, చివరికి మూడో  పెళ్లి కూడా పెటాకుల అయ్యిందని… ఇలా రకరకాల విమర్శలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అయితే పవన్ మాత్రం ఎవరి ఏమీ అన్నా పట్టించుకోకుండా వారి విమర్శలను గాలికి వదిలేసి తన భార్యతో చక్కగా కాలం గడుపుతున్నాడు. అందుకు సాక్ష్యమే పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటన.  

ప్రస్తుతం పవన్..   ఇండియా కాన్ఫరెన్స్ 2017 సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్, అతని  భార్య లెజ్‌నెవా కలిసి వెళ్లడంతో పలు రూమార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఈ ఫొటోలు బయటకి వచ్చిన దగ్గర నుండి పవన్ కి, అతని భార్యకి మధ్య సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని పవన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరి ఇకనుండైనా పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసే వాళ్లు  ఆ పనులను విరమిస్తారేమో చూడాలి.