కెసిఆర్ బాటలో పవన్ ..ఆమరణ దీక్ష ?

0
223

 pawan kalyan Hunger strike like kcr

ఆమరణ దీక్ష …ఇదే ఆయుధంతో కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ సాధించారు .ఇప్పుడు జనసేనానాధిపతి పవన్ కళ్యాణ్ సైతం అదే బాటలో నడవబోతున్నారని ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు .హోదా ఇవ్వకుండా మొండి పట్టు పడుతన్న కేంద్రం మెడలు వంచడానికి అంతకి మించి మార్గం లేదని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది .కాకినాడలో తలపెట్టిన ఆంధ్రుల ఆత్మగౌరవ సభ వేదిక నుంచే పవన్ ఆమరణ దీక్ష ప్రకటన చేసే అవకాశాల్ని కొట్టిపారేయలేము .

రాజ్యసభ తో పాటు ప్యాకేజ్ ప్రకటన చూసిన పవన్ కేంద్రానికి రాష్ట్రమంటే కనీస గౌరవం కూడా లేనట్లుందని వ్యాఖ్యానించారట .మామూలు సభలు ,సమావేశాలతో మోడీ సర్కార్ ని హోదా కి ఒప్పించలేమని పవన్ డిసైడ్ అయ్యాకే దీక్ష అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం.తాను దీక్షకికూర్చుంటే హోదా పోరాటం వేడెక్కుతుందని..అధికార పక్షం కూడా తప్పని సరిగా గోదాలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పవన్ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది .