ఎర్ర జెండా ఎత్తనున్న పవన్ కళ్యాణ్…?

Posted December 1, 2016

Image result for pawan into cpi

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆంధ్ర ప్రదేశ్ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు లు కలిసారు. హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లోని జనసేన కార్యాలయంలో పవన్ తో వారు సమావేశమయ్యారు . ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నోట్ల రద్దు, తదనంతరం ఏర్పడిన పరిస్థితులు వంటి వాటిపై చర్చించారు. వామపక్ష పార్టీల భావజాలాన్ని పవన్ కల్యాణ్ అభినందించినట్టు తెలుస్తోంది. తాజా పరిస్థితులు ఏపీపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయన్న విషయంపై కూడా వీరు చర్చించినట్టు సమాచారం.భవిష్యత్తులో ప్రజా సమస్యల పై సిపిఐ, జనసేన లు సంయుక్తం గా పోరాడాలని సిపిఐ నాయకులు కోరినట్టు సమాచారం ..