కాటమరాయుడు కధ ?

Posted September 26, 2016

 pawan kalyan katama rayudu movie story
పవన్ కళ్యాణ్ సరికొత్త సినిమా కాటమరాయుడు..ఈ సినిమాతో ఆయనకి ప్రమోషన్ రాబోతోంది. మెగా ఫ్యామిలి లో తమ్ముడిగా ఉన్న పవన్ ఈ సినిమాతో అన్న కాబోతున్నాడు.ఇంతకు ముందు ఓ చెల్లెలికి అన్నగా అన్నవరం వంటి సినిమా చేసిన పవన్ ఇప్పుడు కాటమరాయుడులో నలుగురు తమ్ముళ్ళకి అన్నగా నటించబోతున్నట్టు సమాచారం.గతంలో మెగా స్టార్ నటించిన అన్నయ్య సినిమా గుర్తొస్తోందా? దాంతో పాటు yvs చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో ఓ పాయింట్ మిక్స్ చేసినట్టు వుంటుందట కాటమరాయుడు.

అయితే సినిమా ఆద్యంతం వినోదానికి పెద్ద పీట వేసేలా పవన్ పాత్ర ఓ ఫ్యాక్షనిస్ట్ అంట.ప్రేమ బంధంలో చిక్కుకున్న తమ్ముళ్లు అన్నని కూడా ప్రేమలోదించితేనే తమ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావించి ఆ వైపు ప్రయత్నం చేస్తారంట.అయితే నూనూగు మీసాల వయసులో ఓ లవ్ స్టోరీ నడుపుతాడంట కాటమరాయుడు..తాజాగా తమ్ముళ్ల ప్రయత్నాలతో పవన్ ఏమి చేసాడన్నది మిగతా కధంతా..