పవన్ సరికొత్త రికార్డు..!!

 Posted February 15, 2017

pawan kalyan katamarayudu movie teaser creates recordsఒకప్పుడు సినిమా హిట్ ఫ్లాప్ అనేది… ఆ సినిమా ధియేటర్లో ఆడిన రోజులు, సాధించిన కలెక్షన్లను బట్టి నిర్ణయించేవారు. దాన్ని బట్టి హీరో స్టామినా తెలిసేది. అయితే ఇటీవల కాలంలో సీన్ మారింది. టీజర్లు, ట్రైలర్లను బట్టి హీరోల స్టామినాను, సినిమా రేంజ్ ని నిర్ణయిస్తున్నారు.

టీజర్ కానీ,ట్రైలర్ కానీ విడుదలైన తర్వాత ఎన్ని లైకులు వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేవి లెక్కలోకి తీసుకుని తమ హీరోకున్న హీరోయిజాన్ని లెక్కగడుతున్నారు అభిమానులు. దీంతో హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద కాకుండా సోషల్ మీడియాలో పోటీపడుతున్నారు.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంత వరకు ఏ తెలుగు హీరో సాధించలేని సరికొత్త రికార్డు యూట్యూబ్ లో సృష్టించాడు. వారం కిందట కాటమరాయుడు ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. అది  విడుదలైన నాటినుండి సరికొత్త రికార్డ్స్ సాధిస్తూనే ఉంది.  తాజాగా యూట్యూబ్ లో 2 లక్షల లైకులు కొట్టించుకున్న తొలి టీజర్ గా ‘కాటమరాయుడు’ వండర్ క్రియేట్ చేసింది. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ ‘బాహుబలి’ కూడా ఈ ఘనత దక్కకపోవడం విశేషం. ఈ ఒక్క టీజర్ తో పవన్ పవర్ ఏంటో మరోసారి ప్రూ అయ్యింది.