టిడిపి ఒక కులానికి,వర్గానికి …పవన్ వ్యాఖ్య

Posted November 10, 2016

pawan kalyan said ananthapuram meeting tdp party is only ruling for caste category peopleఅధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక కులానికి, ఒక వర్గానికికాని, ఒక ప్రాంతానికి గాని పనిచేస్తోందన్న అబిప్రాయం వస్తోందని జనసేన వ్యవస్తాపకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగుదేశం పార్టీపై వస్తున్న ఆరోపణలను సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు. అమరావతి రాజధానిపై రాయలసీమలో కాని, ఉత్తరాంద్రలో కాని భిన్నమైన అబిప్రాయాలు వస్తున్నాయని,వాటి గురించి ఆలోచించకపోతే మళ్లీ విభజన ఉద్యమాలు వస్తాయని ఆయన హెచ్చరించారు. అనంతపురానికి వంద టి.ఎమ్.సిల నీరు ఇవ్వాల్సి ఉందని, ప్రతి జిల్లాలోని గ్రామాల నుంచి మట్టి,నీరు సేకరించారని, కాని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం అక్కడ ఉందా అని అడిగారు.కేవలం డబ్బు ఉన్నవారికోసమే రాజధాని అన్న విమర్వ వస్తోందని,దానిని గుర్తించాలని అన్నారు.⁠⁠⁠⁠

[wpdevart_youtube]g9WOvhE6es4[/wpdevart_youtube]