షూటింగ్ కి డేట్ సెట్ చేసిన పవన్, త్రివిక్రమ్

Posted February 14, 2017

pawan kalyan trivikram movie shooting detailsపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషనలో సినిమా అంటే అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీలో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అవ్వడమే అందుకు కారణం. అత్తారింటికి దారేది సినిమా అయితే ఇండస్ట్రీలో ప్రకంనాలు సృష్టించింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడు మొదలౌతుందా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.  

దీంతో పవన్-త్రివిక్రమ్ లు ఓ మూవీ స్టార్ట్ చేయనున్నామని  పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దాదాపు మూడు నెలలు కావస్తున్నా.. ఇప్పటివరకూ షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ షూటింగ్ డేట్ ని సెట్ చేశారు.  మార్చ్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ తెలిపింది. పవన్ కోసం త్రివిక్రమ్ ఓ అద్భుతమైన స్టోరీ రెడీ చేశాడని, టాలీవుడ్ రికార్డులను మరో సారి ఈ సినిమా తిరగరాస్తుందని ఫిల్మ్ నగర్ లో టక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమాన్యుయేల్ జతకట్టనున్నారు. ఇప్పటికే ఓ రేంజ్ లో మోత మోగిపోతున్న పవన్ పేరు ఈ సినిమాతో  ఇంకెంత వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.