పవన్ vs వైసీపీ@ కాపు ఉద్యమం..

 mudragada padmanabham meet kapu leaders
ప్రత్యేక హోదా డిమాండ్ తో ప్రజలముందుకొస్తున్న పవన్ ని నిలువరించడానికి వైసీపీ పరోక్ష ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ముద్రగడ చేస్తున్న కాపు రిజర్వేషన్ ఉద్యమానికి కాపుల మద్దతు కూడగట్టడంలో వైసీపీ వ్యూహకర్తలు తలమునకలయ్యారు.దాసరి ఇంట్లో సమావేశమైన ముద్రగడ,బొత్స,అంబటిరాంబాబు …ఇలా వైసీపీ లో కీలకపాత్ర పోషిస్తున్నవాళ్ళే ఇక్కడా చురుగ్గా వుంటున్నారు.చిరంజీవి కాంగ్రెస్ వాడైనా చర్చల్లో దాసరి మాటకే ప్రాధాన్యం లభిస్తోందంట.చిరు మీద అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే దాసరికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వైసీపీ ముద్రగడ ఉద్యమాన్ని హైజాక్ చేస్తోందన్న వాదనలు కాపు నేతల నుంచే వినిపిస్తున్నాయి.

వైసీపీ తాజా ఎత్తుగడ తో పవన్ ని టార్గెట్ చేస్తుందనడానికి కచ్చితమైన ఆధారాలున్నాయని అయన అభిమానులు అంటున్నారు.దాసరి ఇంట్లో సమావేశం తర్వాత పవన్ గురించి అడిగినప్పుడు వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించిన తీరును వాళ్ళు ప్రస్తావిస్తున్నారు.
ముద్రగడ వెనుకే కాపు సమాజం ఉందని చెప్పడానికే సమావేశమైనట్టు అంబటి చెప్పారు.తమతో కలిసొస్తారో లేదో పవన్ నే అడగాలని రాంబాబు వ్యాఖ్యానించారు.ఇంత మంది పెద్దలు కలిసినప్పుడు పవన్ తో ఓ మాట ఎందుకు చెప్పకూడదని పవర్ స్టార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు .పవన్ కాకినాడ సభని అడ్డుకోవడం లేదా విఫలం చేయడానికి కాపు ఉద్యమం ముసుగులో వైసీపీ కుట్ర చేస్తోందని వారు అంటున్నారు.