పవన్ ది డబల్ రోల్ ?

0
115

Posted April 25, 2017 at 10:17

pawan the double role
పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ వెండితెర మీద తనదైన నటనతో ఎందరినో మెప్పించాడు. ఏ రోల్ లో అయినా ఇట్టే ఒదిగిపోయాడు.కానీ తాజాగా జనసేనాధిపతిగా ఆయన పొలిటికల్ గా ఒకే రోల్ పోషిస్తున్నాడు.కానీ బీజేపీ కి మాత్రం పవన్ డబల్ రోల్ లో కనిపిస్తున్నాడు.అదెలా సాధ్యం అనేగా మీ డౌట్ ? మీరే చూడండి..
జనసేన అధిపతిగా పవన్ కళ్యాణ్ ఉత్తర దక్షిణ భారతాల మధ్య వ్యత్యాసాన్ని పదేపదే ఎత్తి చూపుతున్నారు.అధికార బీజేపీ దక్షిణాదిని చిన్న చూపు చూస్తోందని పవన్ బాధపడడం చూస్తూనే వున్నాం.ఆయన ఎంతగా బీజేపీ ని టార్గెట్ చేసినా ఏపీ కి చెందిన కమలనాధులు నోరు మెదపడం లేదు.పైగా సోము వీర్రాజు లాంటి ఫైర్ బ్రాండ్ నేత కూడా ఎప్పటికైనా పవన్ మావాడే అన్నట్టు మాట్లాడుతున్నారు.భవిష్యత్ ఎన్నికల దృష్టితో పవన్ ఎంత గా రెచ్చగొట్టినా ఏపీ బీజేపీ నేతలు సంయమనం పాటిస్తూ ఆయనలో అమాయకుడిని మాత్రమే చూస్తున్నారు.అదే టైములో పవన్ తో ఎన్నికల భయం లేని తెలంగాణ నేతలు మాత్రం ఆయన్ని చెడుగుడు ఆడేసుకుంటున్నారు.ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ ఓ అడుగు ముందుకేసి పవన్ మానసిక స్థితి మీదే సందేహపడ్డారు. ఉత్తరాది,దక్షిణాది అని పవన్ చేస్తున్న ట్వీట్స్ రాజకీయ నిరుద్యోగానికి నిదర్శనం అంటున్నారు.అదే మరి రాజకీయం అంటే ..పవన్ ఒక్కడే ..కానీ బీజేపీ కి రెండుగా కనిపిస్తున్నాడు ఏమి చేస్తాం.