పవన్‌, త్రివిక్రమ్‌ టైటిల్‌ ముచ్చట్లు

0
121

Posted May 10, 2017 at 17:56

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాధాకృష్ణ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబో చిత్రాలు ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా త్రివిక్రమ్‌ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

ఇక సినిమా టైటిల్‌కు సంబంధించిన మొదటి నుండి కూడా ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. దేవుడే దిగి వచ్చిన అంటూ షూటింగ్‌ ప్రారంభం కాక ముందు నుండే ప్రచారం జరుగుతుంది. షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత ‘పరదేశ ప్రయాణం’ అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా విభిన్నంగా ‘గోకుల కృష్ణుడు’ అనే టైటిల్‌ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఒక టైటిల్‌ను ఫిక్స్‌ చేసే అవకాశాలున్నాయి. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తానంటూ త్రివిక్రమ్‌ నమ్మకంగా చెబుతున్నాడు. ఈ చిత్రంతో పవన్‌ తన గత రికార్డులను బ్రేక్‌ చేస్తాడని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.