పవన్, త్రివిక్రం, నితిన్ టైటిల్ ఫిక్స్

Posted December 6, 2016

Pawan Trivikram Nitin Movie Title Fixed As LIEనితిన్ హీరోగా కృష్ణ చైతన్య డైరక్షన్లో రీసెంట్ గా ఓ మూవీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారట. ఎల్.ఐ.ఈ ‘లై’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. అదేంటి అంటే లవ్ ఈజ్ ఎండ్లెస్ అని అంటున్నాడు దర్శకుడు కృష్ణ చైతన్య. రౌడి ఫెల్లో సినిమాతో తన ప్రతిభ చాటుకున్న ఇతను ఏకంగా త్రివిక్రం శ్రీనివాస్ నే మెప్పించిన కథ చెప్పాడంటే ఏమో అనుకున్నారు కాని టైటిల్ తోనే తన ప్రత్యేకత చాటుకున్నాడు.

అఆ తర్వాత రేంజ్ పెరగడంతో అదే తరహా కథలకు ప్రాధాన్యత ఇస్తున్న లవర్ బోయ్ నితిన్ ఓ పక్క హను రాఘవపుడి సినిమా చేస్తూనే మరో పక్క ఈ లై సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబందించిన షూటింగ్ సైలెంట్ గా కనిచ్చేస్తున్నారట. తన అభిమాన నటుడి సమర్పణలో నటిస్తున్న నితిన్ కు ఈ సినిమా చాలా ప్రత్యేకం అని చెప్పాల్సిన పనిలేదు. ఇక ఓ పక్క పవన్ త్రివిక్రం సినిమా కూడా వచ్చే నెలలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది.

సినిమాలో నితిన్ కు జోడిగా ఎవరు నటిస్తున్నారు అన్న దాని మీద క్లారిటీ రాలేదు. కాస్ట్ అండ్ క్రూ గురించిన మిగతా విషయాలన్నీ త్వరలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.