ఏ షాపులో పేటీఎం అంగీకరిస్తారో తెలుసా..!

Posted November 13, 2016

+ క్లిక్‌ కొడితే మీ దగ్గర్లో ఉన్న స్టోర్‌ తెలుస్తుంది
+ యాప్‌ అప్‌డేట్‌ చేసుకుంటే ఈ ఫీచర్ వస్తుంది
Paytm Unveils 'Nearby' Feature to Help Discover Paytm-Ready Merchants
పెద్ద నోట్ల రద్దుతో ఏదైనా కొనుగోలు చేయాలంటే ఆన్‌లైన్‌ మీదే ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా డిజిటల్‌ వ్యాలెట్ల ద్వారా చేయడానికి ఆసక్తిచూపుతున్నారు. దాంతో వాటి లావాదేశీలు 400 శాతం కంటే పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పేటీఎం, ఫ్రీచార్జ్‌, మోబిక్విక్‌, ఎయిర్‌టెల్‌ మనీ వాలెట్స్‌ వినియోగం బాగా వృద్ధి చెందింది.. దాన్ని దృష్టిలో ఉంచుకుని పేటీఎం సంస్థ కొత్తగా ఆన్‌లైన్‌ పేమెంట్లతోపాటు ఆఫ్‌లైన్‌ మర్చెంట్ల ద్వారా మరింత ప్రాచుర్యం కల్పించాలని సంకల్పించింది. ఏదైనా షాపులో కొనుగోల చేసినా దాని ద్వారా డబ్బులు చెల్లించేలా దేశవ్యాప్తంగా కొత్తగా 2లక్షలపైగా వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు ఆయా స్టోర్లు ఎక్కడున్నాయో తెలియాలంటే పేటీఎం లేటెస్ట్‌ యాప్‌ వేసుకుంటే చాలు.. మనకు దగ్గర్లో ఉన్న స్టోర్ల వివరాలు తెలుస్తాయి. దానితోపాటు అవి ఎంత దూరంలో ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.. ప్రస్తుతం 8 లక్షల వ్యాపారులను పేటీఎంని అంగీకరిస్తున్నట్లు పేర్కొంది..
నోట్ల రద్దు తరవాత పేటీఎం పుంజుకున్నతీరు..
– ట్రాఫిక్‌ 435 శాతం పెరిగింది
– యాప్‌ డౌన్‌లోడ్స్‌ 200 శాతం పెరిగింది
– మనీ యాడ్‌ చేయడం 1000 శాతం పెరిగింది
– ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ లావాదేవీలు 400 శాతం పెరిగాయి
– మొత్తం లావాదేవీలు 250 శాతం పెరిగాయి