మోడీ దెబ్బకు ట్రంప్, పుతిన్ వెనుకంజ

Posted December 1, 2016

Image result for narendra modi person of the year
ప్రధాని నరేంద్రమోడీ పాపులారిటీ దేశంలోనే కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని చాలా కంట్రీస్ మోడీస్ కు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే..ఇటీవల టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన ఆన్ లైన్ ఓటింగ్ లో మోడీ టాప్ ప్లేసుకు దక్కించుకున్నారు. పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2016 పేరుతో నిర్వహించిన ఈ ఓటింగ్ లో మోడీకి పెద్దత్తున స్పందన వచ్చింది.
ఓటింగ్ లో మోడీ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద లీడర్లు సైతం వెనుకబడ్డారు. అమెరికా పీఠమెక్కబోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ లను మోడీ వెనక్కు నెట్టేశారు. ఈ ఏడాది పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పోలింగ్‌లో ఇప్పటివరకు పోలైన ఓట్ల ప్రకారం ప్రధాని మోడీ 21శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజే 10శాతం ఓట్లతో ఉన్నారు. ఒబామా 7 శాతం, పుతిన్‌, ట్రంప్‌ 6 శాతం ఓట్ల చొప్పున సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

డిసెంబరు 4వ తేదీతో ఈ పోల్‌ ముగుస్తుంది. ప్రతి ఏడాది టైమ్ పత్రిక సంపాదక బృందం ప్రపంచ నేతలు, అధ్యక్షులు, ఆందోళనకారులు, వ్యోమగాములు వంటి వివిధ రంగాల్లో ఐకాన్స్‌గా నిలిచిన కొంతమందిని ఎంపిక చేసి ఈ ఆన్ లైన్ ఓటింగ్ నిర్వహిస్తుంది. ఇందులో టాప్ పొజిషన్ లో నిలవడమంటే మామూలు విషయం కాదు. మోడీనా.. మజాకా?