వర్మ జీవితంపై రీసెర్చ్

Posted November 4, 2016

vrm1416సంచలన దర్శకుడు వర్మ జీవితంపై ఇప్పుడు ఓ ఆంధ్రా యూనివర్సిటీ కుర్రాడు రీసెర్చ్ మొదలు పెట్టాడు. పి.హెచ్.డి చేస్తున్న ప్రవీణ్ రామ్ గోపాల్ వర్మ జీవితం మీద రీసెర్చ్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ రీసెర్చ్ తాలూఖా రికార్డ్ కూడా బుక్ రూపంలో రిలీజ్ చేస్తారట. శివ సినిమాతో తన సత్తా చాటిన వర్మ తెలుగు సినిమాను కమర్షియల్ బాట పట్టించిన దర్శకుడు అని చెప్పాలి.

సగటు మనిషి జీవిత ఇతివృత్తాంతంతో వర్మ తీసిన సినిమాలు ఇప్పటి నూతన దర్శకులకు ఓ మార్గదర్శకాలు. ఎందుకు అనిపించిందో ఏమో కాని ప్రవీణ్ కు పి.హెచ్.డి ప్రాజెక్ట్ గా వర్మ జీవితాన్ని రీసెర్చ్ చేయాలని అనిపించిందట. అంతే ఒక్కసారిగా ఇది హాట్ న్యూస్ అయ్యింది. వర్మకు సంబందించిన విషయాలను తెలుసుకోవడంలో అతనికి ఎవరు సహాయం చేస్తున్నారు అన్నది తెలియలేదు. మొత్తానికి ఓ పి.హెచ్.డి కుర్రాడు వర్మని టార్గెట్ చేశాడన్నమాట. ఇప్పటికే వర్మ తన మనోగతన్ని నా ఇష్టంలో తెలిపాడు. సిరా శ్రీ కూడా వోడ్కా విత్ వర్మ అంటూ వర్మ మీద బుక్ రాశాడు. అంతేకాదు గన్స్ అండ్ థైస్ అని మరో సంచలనం రిలీజ్ చేశాడు వర్మ. ఇన్ని ఉన్నా కుర్రాడు రీసెర్చ్ చేసి కొత్త విషయాలేమైనా కనిపెడతాడా అన్న ఎక్సయిట్మెంట్ అందరిలో మొదలైంది.