త్వరలో తెరపైకి నందమూరి మల్టీస్టారర్

Posted February 6, 2017

planning for nandamuri multistarrerఅక్కినేని ఫ్యామిలీ  మల్టీస్టారర్ మనం సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  కాగా త్వరలో మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్ రానుందని ఆ చిత్ర నిర్మాత, ఎంపీ టి. సుబ్బిరామి రెడ్డి రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో పాటుగా నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్ కూడా త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం.

ఓ పక్క తమ్ముడు ఎన్టీఆర్‌ హీరోగా నిర్మించబోయే సినిమా పనులతో బిజీగా ఉన్న నందమూరి కళ్యాణ్‌రామ్‌.. మరోపక్క తాను హీరోగా నటించనున్న ఈ మల్టీస్టారర్  కోసం కథలు వింటున్నాడట. పలు కధలు విన్న ఆయన దర్శకుడు పవన్‌ సాధినేని చెప్పిన కధ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడని సమాచారం. ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’, ‘సావిత్రి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన  పవన్‌ సాధినేని చెప్పిన కథకి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశారని తెలుస్తోంది.

ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేసే జోనర్ లో  ఈ సినిమా రూపొందనుందని, ఓ పవర్ ఫుల్ రోల్లో నందమూరి హరికృష్ణ నటించనున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది.  ఈ నెల 10న ఎన్టీఆర్‌ సినిమా పూజా కార్యక్రమాలు  నిర్వహించిన తర్వాత  కళ్యాణ్ రామ్ తన సినిమాను ట్రాక్ లో పెడతారని సమాచారం.