సంపూర్ణేష్ అరెస్ట్ …నిరసన వేదిక మార్పు

Posted January 26, 2017

police are to arrested sampoornesh babu and special status meeting spot changedఏపీ కి ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్ లో తలపెట్టిన మౌన నిరసనకు మద్దతు ప్రకటించిన తెలంగాణాకి చెందిన హీరో సంపూర్ణేష్ బాబు అరెస్ట్ అయ్యారు. ఈ వుద్యమానికి సంఘీభావం ప్రకటించేందుకు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ,సంపూర్ణేష్ బాబు తదితరులు హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చారు. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు.అతి కష్టం మీద బీచ్ వద్దకు చేరుకున్న సంపూర్ణేష్ బాబుని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరో వైపు తీవ్ర పోలీస్ నిర్బంధంతో ఆర్కే బీచ్ లో మౌన ప్రదర్శన జరపలేమని భావించిన యువ ప్రతినిధులు నిరసన వేదిక మార్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.ఓ పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన ట్వీట్ కి బదులిస్తూ సంపూర్ణేష్ బాబు వుడా పార్క్ కి నిరసన వేదిక మారిందా అని ప్రశ్నించడం తో ఈ విషయం బయటికి వచ్చింది.యువత ఏదో విధంగా ,విశాఖలో ఎక్కడో ఓ చోట ఈ సాయంత్రంలోగా నిరసన కి దిగాలని కృత నిశ్చయంతో వుంది.