రద్దు ఎఫెక్ట్ …మోడీపై కేసు?

Posted November 24, 2016

police case files on modi because old notes banned
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ప్రధాని మోడీకి మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతోంది.రద్దు ఎఫెక్ట్ తో అయన మీద ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది.rbi గవర్నర్ ఉర్జిత్ పటేల్ కి కూడా ఇదే పరిస్థితి.ఇలా ఎందుకు అయిందంటే …

పెద్ద నోట్ల రద్దు తర్వాత పోలం ఇన్నయ్య అనే వ్యక్తి ATM కేంద్రం వద్ద నుంచొని ప్రాణాలు కోల్పోయాడు.దీంతో హతాశులైన ఇన్నయ్య కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో మోడీ,ఉర్జిత్ పటేల్ మీద ఫిర్యాదు చేయడంతో పాటు తహసీల్దార్ ని కలిసి తమకు జరిగిన నష్టాన్ని,కలిగిన కష్టాన్ని వివరించారు.ఇంటి పెద్దని కోల్పోయిన తమకు 25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.