ముద్రగడ హౌస్అరెస్ట్..యాత్ర వాయిదా

Posted November 15, 2016

polices house arrest to mudragada
కాపు రిజర్వేషన్ డిమాండ్ తో ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు ఏపీ సర్కార్ బ్రేక్ వేసింది.మరికొన్ని గంటల్లో అయన పాదయాత్ర మొదలవుతుందనగా ముద్రగడని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఇదే అంశాన్ని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ప్రకటించారు.ముద్రగడ యాత్రకి అనుమతి కోరితే అప్పుడు పరిశీలిస్తామని అయన స్పష్టం చేశారు.అనుమతి కోరకుండా యాత్ర తలపెడితే ఎన్నిసార్లయినా ఆయన్ను అరెస్ట్ చేస్తామని ఎస్పీ కుండబద్దలు కొట్టారు. పోలీస్ నిర్ణయంతో యాత్రని వాయిదా వేసుకుంటున్నట్టు ముద్రగడ ప్రకటించారు.కోర్ట్ అనుమతి ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని అయన ధ్వజమెత్తారు. పాదయాత్రకు పోలీస్ అనుమతి అవసరం లేదని చెప్పిన అయన మళ్లీ దాన్ని ఎప్పుడు ప్రారంభించేది త్వరలో చెప్తానన్నారు.