అమ్మ గురించి ఎవరేమన్నారు..?

Posted December 6, 2016

Image result for jayalalitha passed away**‘దేశ రాజకీయాల్లో పెద్ద శూన్యం ఏర్పడింది. ప్రజలతో ఆమె మమేకమైన తీరు, పేదలు, మహిళలు, అణగారిన వర్గాల సంక్షేమం పట్ల ఆమెకున్న తపన ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి లభించాలని ఆకాంక్షిస్తున్నాను’- ప్రధానమంత్రి నరేంద్రమోదీ

 

**‘తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు పేద ప్రజల సంక్షేమానికి కృషి చేశారు’- ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ

 

**వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేసిన జయలలిత ప్రస్థానం సాహసోపేతమైనది’- తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు

**‘ప్రజా జీవితంలో జయలలిత ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తమిళనాట అందరికీ ‘అమ్మ’గా నిలిచి నిజమైన నాయకురాలిగా జన్మ సార్థకం చేసుకున్నారు’- ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు

**‘ఆమె నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం అద్భుతం. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఆమె ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి గొప్ప నాయకురాలిగా నిలిచారు’ –కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ

**‘జయలలిత గొప్ప నేత. పలు అభివృద్ధి పథకాల ద్వారా ఆమె తమిళ రాష్ట్ర ప్రజల జీవితాలను మార్చారు. అందుకే ఆమెను అందరూ ప్రేమగా ‘అమ్మ’ అని పిలుచుకుంటారు’- మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

**‘సీఎం జయలలిత మృతి తీరని లోటు’- కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య

**‘తమిళనాడు రాష్ట్రానికి ఇది కోలుకోలేని నష్టం. పేద ప్రజలకు ఆమె దేవత’- కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌

**‘ఆమె రాజకీయాల్లో ఎంతో శ్రమించారు, ఎక్కడా రాజీపడలేదు. దివంగత నేత, గురువు ఎంజీఆర్‌కు సమానంగా ఆమె నిలిచారు. విమర్శలు వచ్చినా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు’ –కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం

**‘ప్రజల కోసం ఆమె చేసిన సేవలు స్ఫూర్తినిస్తాయి. తమిళ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి’- మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌

**‘సీఎం జయలలిత మృతి బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బిహార్‌లో ఒక రోజు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించాం’- సీఎం నితీశ్‌కుమార్‌

**‘సీఎం జయలలిత ఉక్కు మహిళ. తమిళనాడు ప్రజల కోసం ఆమె ఎంతో శ్రమించారు’- మలయాళ నటుడు మమ్ముట్టి

**భారతీయ సినిమా రంగంలో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న రాష్ట్రానికి ఏకైక మహిళా ముఖ్యమంత్రి జయలలిత. ఆమె ఓ దృఢమైన మహిళ’- అమితాబ్‌ బచ్చన్‌

** తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి సీఎం జయలలితకు నటుడు రజనీకాంత్‌ నివాళులర్పించారు.

**‘నేను సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు ‘అమ్మ’ను తొలిసారి కలిశాను. గొప్ప నటి. ఎందరో మహిళలు, పురుషులకి ఆదర్శంగా నిలిచింది. తమిళఅన్నాచెల్లెళ్లు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అమ్మ లేని బాధవర్ణనాతీతం’- మోహన్‌ బాబు

**జ‌య‌ల‌లిత మృతి దేశానికి తీర‌ని లోటు- ప‌వ‌న్ కల్యాణ్‌

**‘ప్రజల నేతని కోల్పోయాం. మిమ్మల్ని చివరి వరకూ గుర్తు పెట్టుకుంటాం’- సూర్య

**‘ప్రజలకు మంచి జరగాలని ఎంతో చేసిన నేత, నటి. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ అమ్మా’- రణ్‌దీప్‌ హుడా

**‘జయలలిత గారు దృఢమైన నేత. ఆమె ఈరోజు ప్రజల మధ్యలేకపోయినా ఎందరికో స్పూర్తిగా నిలిచారు’- కళ్యాణ్‌ రామ్‌

**‘అమ్మ ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈరోజు అమ్మ లేకపోయినా మహిళల్లో ఆమె ఎప్పటికీ నిలిచే ఉంటారు’- ఎన్టీఆర్‌

***‘ఎప్పటికీ గుర్తుండిపోయే మహిళ. నిజమైన యోధురాలు’- రవీనా టాండన్‌

**‘జయలలిత గారు చనిపోయారంటే చాలా బాధగా ఉంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా’- షారుఖ్‌ ఖాన్‌

**ఎందరికో చాలా బాధాకరమైన దినం’- ఫరా ఖాన్‌

**‘తమిళనాడు ప్రజలు దృఢంగా ఉండాలని ఆశిస్తున్నాను’- వీరేంద్ర సెహ్వాగ్‌

**‘అమ్మ ఆత్మకు శాంతి కలగాలి’సైనా నెహ్వాల్‌