ప్రధానికి బన్ని భామ సలహా..!

Posted November 12, 2016

pj1216ప్రధాని మోది ప్రవేశ పెట్టిన 500, 1000 నోట్ల రద్దు కార్యక్రమానికి ఇప్పటికే పరులువురు సిని ప్రముఖులు తమ అభిప్రాయాన్ని తెలియ చేసిన సగతి తెలిసిందే. అయితే ఈ ప్రయత్నంలో బన్ని దువ్వాడ జగన్నాథం హీరోయిన్ పూజా హెగ్దె ఇంకాస్త ముందడుగేసి ప్రధానికి ఓ సలహా ఇచ్చేసింది. మార్చ్ 31 దాకా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఈ చెల్లుబాటు కాని 500, 1000 రూపాయల నోట్లు విరాళాలు ఇచ్చే ఏర్పాటు చేస్తే డబ్బు పేదవారికి ఉపయోగపడినట్టు ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిల అభివృద్ధికి తోడ్పడినట్టు ఉంటుందని అని అన్నది.

కేవలం ఇది నా సలహా మాత్రమే అని ట్వీట్ చేసింది పూజా. అయితే అమ్మడు చెప్పిన విధానం బాగున్నా దీనిలో కూడా కొన్ని లొసుగులు ఉండే అవకాశం ఉంది. మరి ఈ విషయం అసలు ప్రధాని దాకా వెళ్లేలా చేస్తారో లేదో చూడాలి. నోట్ల రద్దుతో నల్లధన రాజులకు మాత్రం హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయ్యింది.

ఈ క్రమంలో సిని పరిశ్రమంతా ఒక్కటై మోది చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. దేశ భవిష్యత్ దృష్ట్యా మోది ప్రవేశ పెట్టిన ఈ నోట్ల రద్దు కార్యక్రమంతో రెండు రోజులు ఇబ్బంది పడ్డా మార్పు కోసం ఈ కష్టం పడి తీరాల్సిందే అని సగటు మనిషి అభిప్రాయపడుతున్నాడు.