బుల్లితెర మెగాస్టార్..  డైరెక్టర్ అయిపోతున్నాడు..!!

 Posted February 16, 2017

prabhakar to direct adi movieప్రభాకర్.. ఈ పేరు తెలియని బుల్లితెర అభిమానులు ఉండరు. ఒకప్పుడు ఇతన్ని బుల్లితెర మెగాస్టార్ అని కూడా పిలిచేవారు. అప్పట్లో ఈ టీవీలో ప్రసారమయ్యే ప్రతి సీరియల్లోనూ ప్రభాకర్ ఉండి తీరాల్సిందే. పలు సీరియల్స్ కి దర్శకత్వం కూడా వహించాడు. అయితే రామోజీరావు తనయుడు సుమన్ చనిపోయిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. ప్రభాకర్ ఈ టీవీ నుండి బయటకి రావల్సివచ్చింది. అయితే పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన  ప్రభాకర్ ఆ తర్వాత ఇతర ఛానెల్స్ లో అడపాదడపా సందడిచేస్తూనే ఉన్నాడు. తాజాగా ఇతను వెండితెర రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం.  అయితే నటుడిగా కాదండోయ్… సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట.

అల్లు శిరీష్ తో ఓ సినిమా చేయాలనీ కథను రెడీ చేసి , అతడి డేట్స్ కోసం వెయిట్ చేశాడట. అయితే ప్రస్తుతం శిరీష్ బిజీ గా ఉండడంతో ప్రభాకర్ అదే కథను సాయి కుమార్ తనయుడు ఆది కి చెప్పి ఒకే చేయించాడట. మార్చి నెలాఖరు కల్లా సినిమాను సెట్స్ పైకి తీసుకొళ్లే యోచనలో ఉన్నాడట. రొమాంటిక్ జోనర్ లో ఉండే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్ధ నిర్మిస్తుండడం విశేషం. తన దర్శకత్వ ప్రతిభతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రభాకర్ మరి సినీ అభిమానులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.