విడుదలకి ముందే బాహుబలి-2  బిజినెస్ అదుర్స్!

Posted February 2, 2017

prabhas bahubali 2 movie world wide pre business collect records collectionsతెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన బాహుబలి… తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు. బాహుబలి ద బిగినింగ్ సినిమాను దాదాపు రూ.180కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కించగా… అది ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా రికార్డుల్లో  చరిత్ర సృష్టించింది. కాగా  బాహుబలి-1 రిలీజ్ తర్వాత రికార్డులను నెలకొల్పితే బాహుబలి-2 మాత్రం రిలీజ్ కి ముందే ప్రభంజనం సృష్టిస్తున్నాడు.

రాజమౌళి దర్శకత్వంలో  తెరకెక్కుతున్న ఈ  సీక్వెల్ బిజినెస్‌ అంతకంతుకూ  పెరిగిపోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 500 కోట్ల బిజినెస్‌ చేసినట్లు సమాచారం. కేవలం డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్ రైట్స్ ద్వారానే  ఈ సినిమా రూ.500 కోట్లు రాబట్టినట్లు ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాల ట్వీట్ చేశారు. ఏప్రిల్‌ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.