జక్కన్న తర్వాత సినిమాపై ప్రభాస్‌ క్లారిటీ

0
106

Posted April 18, 2017

prabhas clarified about rajamouli next film
‘బాహుబలి’ చిత్రం తర్వాత రాజమౌళి తెరకెక్కించబోతున్న సినిమాపై గత నాలుగు సంత్సరాలుగా ఏవో పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయిదు సంవత్సరాలుగా ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కిస్తూ ఉన్న రాజమౌళి ఈనెల 28న సినిమా విడుదల తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తర్వాత సినిమాపై మళ్లీ వార్తలు వస్తున్నాయి. రాజమౌళి తర్వాత సినిమాపై ‘బాహుబలి’ చిత్రంలో నటించిన ప్రభాస్‌ ఒక క్లారిటీ ఇచ్చాడు.

ప్రభాస్‌ మాట్లాడుతూ రాజమౌళి తన తర్వాత సినిమాను ఆరు నెలల తర్వాత కాని ప్రారంభించడు అని తేల్చి చెప్పాడు. అయితే జక్కన్న తర్వాత చేయబోతున్న సినిమా ఏంటి, ఎలా ఉండబోతుంది అనే విషయంలో ఆయనకు కూడా క్లారిటీ లేదు అంటూ ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు. పూర్తిగా ఆరు నెలల విశ్రాంతి తర్వాత రాజమౌళి తన తర్వాత సినిమా గురించి ఆలోచించే అవకాశాలున్నాయని ప్రభాస్‌ పేర్కొన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మహాభారతం తెరకెక్కితే ఏ పాత్ర అయినా చేసేందుకు తాను సిద్దం అంటూ ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు.