‘ధూమ్-4’లో ప్రభాస్.. ఇదీ సంగతి!

0
66

 Posted October 24, 2016

prabhas clarity about dhoom 4 movie‘బాహుబలి’తో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది.దీంతో..బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకొంటున్నాడని… ఇప్పటికే యశ్ రాజ్ “ధూమ్-4” చిత్రానికి ఓకే చెప్పేశాడనే ప్రచారం జరిగింది. తాజాగా, ఈ ప్రచారం పై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు.

బాహుబలి తర్వాత బాలీవుడ్ నుంచి కొన్ని మంచి ఆఫర్లు రావడం నిజమేనని ప్రభాస్ ఒప్పుకొన్నాడు. అయితే, ఆ లిస్టులో యశ్ రాజ్ ‘ధూమ్-4’ లేదట. ధూమ్-4 కోసం నన్ను సంప్రదించారన్న న్యూస్ లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు జూ. రెబల్ స్టార్. అంతేకాదు.. బాహుబలి తర్వాత హోం బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో వరుసగా రెండు సినిమాలు చేయనున్నట్టు తెలిపారు.  ఇందులో ఒకటి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. మరో చిత్రానికి దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది.హోం బ్యానర్ లో రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత అప్పటికీ బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తే ఆలోచిస్తానంటున్నాడు బాహుబలి. ఇక, బాహుబలి సీక్వెల్ బాహుబలి2 వచ్చే యేడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

prabhas clarity about dhoom 4 movie