ప్రభాస్‌ కష్టం వృదా పోలేదు

0
56

 Posted April 28, 2017 at 15:36

prabhas do very hard work for bahubali 2 movie that's why this movie hit
ఒక హీరో తన నాలుగు సంవత్సరాల ముఖ్యమైన కెరీర్‌లో ఒకే ఒక సినిమాకు కమిట్‌ అవ్వడం ఏంటి, అంత సాహసం ఎలా చేయగలిగాడు, అది ఎవరిపై నమ్మకంతో అంటూ ప్రభాస్‌ను ఉద్దేశించి ఎన్నో కామెంట్లు వచ్చాయి. మొదటి పార్ట్‌ విడుదలైన తర్వాత సగం నోర్లు మూత పడగా, రెండవ పార్ట్‌ విడుదల తర్వాత మిగిలిన వారు కూడా నోరు మూసుకుని సాహో బాహబలి అంటున్నారు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్‌ ఏకంగా 100 కేజీల బరువు పెరిగాడు. బరువు పెరిగేందుకు ప్రభాస్‌ పడ్డ కష్టం, మళ్లీ బరువు తగ్గేందుకు ప్రభాస్‌ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

ప్రతి రోజు ఉదయం నాలుగు గంటల నుండే దాదాపు అయిదు గంటల పాటు జిమ్‌ మళ్లీ రాత్రి సమయంలో మూడు గంటల పాటు జిమ్‌లో ప్రభాస్‌ కసరత్తులు చేసేవాడు. ఇక కత్తి యుద్దం, గుర్రపు స్వారీ, గాయాలు ఇలా అన్నింటిని సమానంగా భరిస్తూ ఓర్చుకుంటూ ఈ నాుగు సంవత్సరాల పాటు బాహుబలి కోసం ప్రభాస్‌ కష్టపడ్డాడు. ఈ కష్టానికి ఖచ్చితంగా ఫలితం దక్కిందని చెప్పాలి. ఒక మంచి సినిమా కోసం ఎంత కష్టపడ్డా ఫలితం ఉంటుందని ఈ సినిమాతో ప్రభాస్‌ నిరూపించాడు.