వైజాగ్ అమ్మాయితో బాహుబలి పెళ్లి ?

0
97

 Posted October 19, 2016

prabhas marriage with vizag girl

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ‘బాహుబలి 2’తో బిజీగా ఉన్నాడు. బాహుబలి కోసం ప్రభాస్ పెళ్లిని కూడా పోస్ట్ చేసుకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాహుబలి షూటింగ్ ఆఖరి అంకానికి చేరుకోవడంతో.. ప్రభాస్ పెళ్లి మళ్లి తెరపైకి వచ్చింది.

అయితే, ఇప్పటికే ప్రభాస్ కి జోడి దొరికిందట. ప్రభాస్ నాన్న పెద్దనాన్న చెప్పినట్టుగా భీమవరం అమ్మాయి కాదట. వైజాగ్ అమ్మాయిని ప్రబాస్ పెళ్లాడబోతున్నట్టు సమాచారమ్. ఇప్పటికే అమ్మాయిని చూసి ప్రభాస్ ఓకే చెప్పేశాడట. వైజాగ్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని చెబుతున్నారు. ఈ యేడాది ఆఖర్లో నిశ్చితార్థం.. వచ్చే యేడాది ప్రథమార్థంలో ప్రభాస్ పెళ్లి  జరగనుంది.. ఆయన కుటుంబ సభ్యుల సమాచారమ్. బాహుబలి పెళ్లి అంటే.. టాలీవుడ్, కోలీవుడ్, మాలివుడ్… బాలీవుడ్ ప్రముఖులంతా తరలి రావడం ఖాయం మరీ.. !