మరో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌కు డార్లింగ్‌ సిద్దం

0
77

 Posted May 7, 2017 at 13:18

prabhas next class movie after sahoo
‘బాహుబలి’ సినిమా కోసం నాలుగు సంవత్సరాలు కేటాయించిన ప్రభాస్‌ ఈ నాలుగు సంవత్సరాల్లో మరో సినిమాను చేసింది లేదు. రాజమౌళి మొదటి పార్ట్‌ విడుదల తర్వాత మరో సినిమా చేసుకోవాలంటూ సూచించినా కూడా ప్రభాస్‌ మాత్రం నో చెప్పాడు. ‘బాహుబలి 2’ పూర్తి అయిన తర్వాత సుజీత్‌ దర్శకత్వంలో ‘సాహో’ సినిమాను చేసేందుకు ప్రభాస్‌ రెడీ అయ్యాడు. ‘సాహో’ సినిమా షూటింగ్‌ త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా చేసేందుకు ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

‘సాహో’ సినిమాను మిత్రులు వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మిస్తుండగా, మరో సినిమా నిర్మాత బాధ్యతను కృష్ణంరాజుకు ప్రభాస్‌ అప్పగించాడు. ‘జిల్‌’ వంటి క్లాస్‌ సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ ఆ సినిమాను చేయబోతున్నాడు. తక్కువ బడ్జెట్‌తో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ మరియు ‘డార్లింగ్‌’ తరహాలో క్లాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ప్రభాస్‌ సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు. అతి త్వరలోనే ఈ రెండు సినిమాలు కూడా సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. వచ్చే సంవత్సరంలో రెండు సినిమాలు కొద్ది గ్యాప్‌లోనే విడుదల చేయాలని ప్రభాస్‌ భావిస్తున్నాడు.