ప్రభాస్ సాధించిన రేర్ ఫీట్

Posted October 1, 2016

prabhas rare feetకంగ్రాట్స్ ప్రభాస్..తెలుగు సినిమా పరిశ్రమలో ఈ తరహా గౌరవానికి ఇధే శ్రీకారం. మేడమ టస్సాడ్ మ్యూజియమ్ లో ఓ తెలుగు హీరో విగ్రహం పెట్టడం ఇదే తోలిసారి. బాలవుడ్ హీరోలు, హీరోయిన్ల విగ్రహాలు చాలా వున్నాయి టస్సాడ్ మ్యూజియమ్ లో. కానీ తెలుగు హీరో , హీరోయిన్ల విగ్రహాలు వున్నట్లు లేదు.

ప్రభాస్ తన బాహుబలితో ఆ కొరత తీర్చేసాడు. బాహుబలి రూపంలో వున్న ప్రభాస్ విగ్రహం మేడమ్ టస్సాడ్ మ్యూజియమ్ లో కొలువుతీరబోతోంది. ఈ మేరకు అక్కడి కళాకారులు వచ్చి, ప్రభాస్ శారీరక కొలతలు తీసుకుని వెళ్లారు.

దర్శకుడు రాజమౌళి అయిదవ తేదీన చెబుతామన్న ప్రత్యేక వార్త ఇదే. నాలుగు రోజులకు ముందే లీక్ అయిపోయింది. దాంతో ప్రభాస్ ఆఫీసు నుంచే ప్రెస్ నోట్ బయటకు రాక తప్పలేదు. అమితాబ్, షారూఖ్, సల్మాన్, మాధురి, సచిన్ ఇలా ఎందరో ఇండియన్ సెలబ్రిటీలు, మహాత్ముడు, ఇందిర, మోడీ ఇలా పలువురు రాజకీయ ప్రముఖుల విగ్రహాలు మేడమ్ టస్సాడ్ వాక్స్ మ్యూజియమ్ లో వున్నాయి. ప్రభాస్ విగ్రహం కూడా ఇప్పుడు అక్కడ కొలువుతీరుతుంది. నిజంగా అభినందించదగ్గ విషయమే.