‘సాహో’కు తప్పని లీక్‌ బెడద

0
63

Posted April 26, 2017 at 15:11

prabhas saho movie teaser leaked
ఇటీవల టాలీవుడ్‌లో లీక్‌లు ఒక రేంజ్‌లో నిర్మాతలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని సార్లు సినిమా మొత్తం లేదా సీన్స్‌ వరకు లీక్‌ అవుతూ ఉన్నాయి. ‘బాహుబలి’కి ఎన్నో సార్లు లీక్‌ల బెడద తలిగిన విషయం తెల్సిందే. అప్పుడు ‘అత్తారింటికి దారేది’ సినిమా ఏకంగా సగానికి పైగా సినిమా లీక్‌ అయ్యింది. ఇప్పుడు తాజాగా ప్రభాస్‌ తర్వాత సినిమా ‘సాహో’ టీజర్‌ లీక్‌ అయ్యింది.

ఈనెల 28న ‘బాహుబలి 2’ చిత్రంతో ‘సాహో’ టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘సాహో’ సినిమా ఇంకా చిత్రీకరణ మొదలు పెట్టింది లేదు. కాని టీజర్‌ కోసం ప్రత్యేకంగా వారం రోజుల పాటు ప్రభాస్‌పై చిత్రీకరణ జరిపారు. ఆ షాట్స్‌తో టీజర్‌ను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాటు చేస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యింది. ప్రభాస్‌ చెప్పే ఒక డైలాగ్‌ కూడా అప్పుడే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఇలా టీజర్‌కు కూడా భద్రత లేకుండా ఉంటే సినిమాల పరిస్థితి ఏంటని సినీ వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు. టీజర్‌ లీక్‌కు కారణం ఎవరు అనే విషయాన్ని ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.