రాజమౌళిపై ప్రభాస్‌కు ఎంత నమ్మకమో చెప్పడానికి ఇది చాలు!

0
71

Posted April 19, 2017

prabhas says about rajamouli and baahubali movie
ఒక హీరో ఒక్క సినిమా కోసం అయిదు సంవత్సరాలు కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. కాని ప్రభాస్‌ మాత్రం రాజమౌళిపై నమ్మకంతో అయిదు సంవత్సరాల పాటు ‘బాహుబలి’కే కేటాయించాడు. మొదట కేవలం రెండు సంవత్సరాల పాటు ప్రభాస్‌ డేట్స్‌ను రాజమౌళి తీసుకున్నాడు. తీరా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యి సినిమా ప్రారంభించిన తర్వాత దీనిని రెండు పార్ట్‌లుగా తీయాలని, మూడు సంవత్సరాలు పడుతుందని అనుకున్నారు. అయినా కూడా రాజమౌళిపై నమ్మకంతో పర్వాలేదు అంటూ ప్రభాస్‌ కమిట్‌ అయ్యాడు. ఇక మొదటి పార్ట్‌ విడుదలైన తర్వాత రెండవ పార్ట్‌కు దాదాపు 8 నెలల గ్యాప్‌ తీసుకున్నారు.

‘బాహుబలి’ మొదటి పార్ట్‌ పూర్తి అయిన వెంటనే స్వయంగా రాజమౌళి మరో సినిమా చేసుకోవాల్సిందిగా ప్రభాస్‌కు చెప్పాడట. అయితే అందుకు ప్రభాస్‌ నో చెప్పాడు. ఆ గ్యాప్‌లో సినిమా చేసుకునే అవకాశం ఉన్నా కూడా తాను సినిమా చేయనని రాజమౌళితో చెప్పాను, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలనే ఉద్దేశ్యంతో మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పలేదని, ఈ నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది సినిమాలు చేసేవాడిని, కాని నాకు ఇప్పుడు 16 సినిమాలు చేసిన సంతృప్తి మరియు గుర్తింపు వచ్చిందని ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌, రాజమౌళిల మద్య ఈ అవగాహణ మరియు స్నేహం కారణంగానే ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ సాధ్యం అయ్యింది