అబ్బో.. ప్రభాస్ కొత్త చిత్రాన్ని  ప్రారంభించాడుగా..!!

Posted February 13, 2017

prabhas sujit new movie launchహమ్మయ్య ప్రభాస్ ఎట్టకేలకు బాహుబలి మేనియా నుండి బయటపడ్డాడు. తన కొత్త చిత్రాన్ని చాలా సింపుల్ గా  కొంతమంది సన్నిహితుల సమక్షంలో ఈరోజు ప్రారంభించేశాడు.

రన్‌ రాజా రన్‌’ ఫేం సుజిత్‌తో తన నెక్ట్స్ సినిమా ఉండనుందని ప్రభాస్‌ చాలా కాలం క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ప్రకారమే యూవీ క్రియేషన్స్‌ రూ.150కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ పవర్ పుల్ పోలీస్ అధికారి పాత్ర పోషించనున్నట్లు  సమాచారం. విధినిర్వహణకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే పాత్రలో ప్రభాస్ నటించనున్నాడు.  బాహుబలి కోసం పెంచిన దేహదారుఢ్యాన్ని తగ్గించుకుని ఈ కొత్త సినిమాకోసం ప్రభాస్ సన్నబడుతున్నాడు. ఇప్పటికే అతను  తన పాత్రపై కసరత్తు ప్రారంభించాడని చిత్ర నిర్మాణ వర్గాలు తెలిపాయి. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం, రన్ రాజా రన్ తో విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకున్న సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ప్రభాస్ అందుకుంటాడో లేదో చూడాలి.