శ్రీనువైట్లకి మళ్లీ ప్రకాష్ రాజ్ విలనా?

 prakash raj villain srinu vaitla mister movie
శ్రీను వైట్ల ,ప్రకాష్ రాజ్ …ఈ ఇద్దరి మధ్య ఆగడు సినిమా సమయంలో వచ్చిన గొడవలు అందరికీ తెలిసిందే..ఒకరినొకరు ఎంతగా ద్వేషించుకున్నారో చూశాం.కానీ వరస ప్లాప్ లతో వైట్ల హవా తగ్గింది.ఆయనకి దూకుడు సినిమాతో వచ్చిన దూకుడు తగ్గింది.గొడవ జరిగిన ఓ ఏడాదికి ప్రకాష్ రాజ్ తన ఫార్మ్ హౌస్ లో ఇచ్చిన ఓ పార్టీకి శ్రీను వైట్లని పిలవడం ..ఈయన వెళ్లడం ..ఇద్దరి శ్రేయోభిలాషులు వారి మధ్య సంధి కుదర్చడం ..అన్నిఅలాఅలా జరిగిపోయాయి.

ఇద్దరి మధ్య గొడవలు సమసిపోయినా వారు కలిసిపనిచేసే పరిస్థితి ఏర్పడలేదు.ఇప్పుడు మెగా అందగాడు వరుణ్ తేజ్ తో మిస్టర్ తీస్తున్న శ్రీను వైట్ల విలన్ క్యారెక్టర్ ని బాగా వెరైటీ గా తీర్చి దిద్దరంటా.దానికి ప్రకాష్ రాజ్ అయితేనే న్యాయం చేస్తాడని భావించి ఆయన్ను సంప్రదించేందుకు రెడీ అయ్యాడంట.కథ,క్యారెక్టర్ నచ్చితే మళ్లీ వైట్లకి విలన్ గా ప్రకాష్ తెరకెక్కుతాడన్నమాట.