జయలలిత కోసం సాహసం చేసిన రాష్ట్ర పతి…

Posted December 7, 2016

pranab mukherjee came to jayalalitha funeral in plane80 ఏళ్ళ వయసులో కూడా రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ ఎంత సాహసం చేసారో తెలుసా .తమిళ నాడు సీఎం జయలలిత అంత్య క్రియ లకు హాజరవ్వాలనే అభిమానం ఆయన్ని ఢిల్లీ లో ఉండ నివ్వలేదు. మొదట వచ్చిన విమానంలో సాంకేతిక లోపం రావడం తో చెన్నై లో ల్యాండ్ అవకుండానే విమానాన్ని ఢిల్లీ మళ్లించారు ..

ఆ తర్వాత అదే విమానంలోని బిజినెస్ క్లాస్ కుర్చీ కాదు. కనీసం సాధారణ తరగతిలోని చైర్ కూడా కాదు. దానికి హ్యాండ్ రెస్ట్ లేదు. అది నలుగురు కూర్చునే సోఫా వంటిది. దానిపైనే కూర్చుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయాణం చేశారు. హెలికాప్టర్ లో చెన్నైలోని మెరీనా బీచ్ కి విచ్చేయగా, ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మేరీనాకు రోడ్డు మార్గాన వెళితే, జయలలిత పార్థివదేహాన్ని దర్శించుకునే అవకాశాలు ఉండవని తెలిసిన వేళ, ఇదిగో ఇలా సాధారణ జవానులా ఎంఐ-17 రవాణా హెలికాప్టర్ లో కూర్చుని మెరీనా బీచ్ కి చేరుకున్నారు.