జగన్ కి ఎన్టీఆర్ పాట గుర్తు చేసిందెవరు?

0
109

Posted April 25, 2017 at 09:59

prashanth kishore said ntr song to jagan
నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో స్టెప్స్ వేసి అదరగొట్టిన పాట “ఐ వాంట్ టు ఫాలో ఫాలో ఫాలో యు”. ఈ పాటనే మాటగా మార్చి వైసీపీ అధినేత జగన్ దగ్గర చెప్పారంట ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికల మాట చెప్పగానే జగన్,ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.అయితే ఈ భేటీలో ఎన్నికల వ్యూహం గురించి ఏమి చర్చించారన్నది మాత్రం బయటికి రాలేదు.ఓ వైసీపీ ముఖ్యుడు ఆ భేటీలో పాల్గొని బయటికి వచ్చాక తన సన్నిహితులతో చెప్పిన దాన్ని బట్టి పై విషయం లీక్ అయ్యిందట.

ఎన్నికల వ్యూహం మీద చర్చకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ జగన్ తో చాలా జాగ్రత్తగా వ్యవహరించారట.ఇంతకుముందు తాము చేసిన కొన్ని సూచనల్ని జగన్ ఫాలో కాకుండా ఉండటాన్ని ప్రశాంత్ ప్రస్తావించారట.అందులో ప్రధానమైంది తానే కాబోయే సీఎం అని పదేపదే చెప్పడం.దీని వల్ల జరిగే నష్టాన్ని వివరించిన ప్రశాంత్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తన వైఫల్యాన్ని కూడా గుర్తు చేశారట. అక్కడ కాంగ్రెస్ నేతలు తన సూచనలు,సలహాలు సగం సగం పాటించి ఓటమి భారం,బాధ్యత పూర్తిగా తన నెత్తిన పెట్టినట్టు ప్రశాంత్ వాపోయారట.తమ టీం ఎంతో కసరత్తు చేసిన తరువాత ఇచ్చే సలహాలు పాటించకపోవడం వల్ల ఇద్దరికీ నష్టమేనని ఆయన వివరించారట.పైగా చెరో అభిప్రాయం తో ఉండడం కన్నా మీరే వ్యూహ రచన చేస్తే దాని అమలుకు సహకరిస్తామని ప్రశాంత్ చెప్పారట.ఏ ఇబ్బంది లేకుండా,రాకుండా మిమ్మల్ని ఫాలో అయిపోతామని ప్రశాంత్ ఎన్టీఆర్ పాట ఐ వాంట్ టు ఫాలో ఫాలో యు పాట వినిపించేసరికి జగన్ స్టన్ అయ్యాడట.ఇకపై వ్యూహరచన,అమలులో మీ మాట మన్నిస్తానని చెప్పడంతో ప్రశాంత్ కూల్ అయ్యారట.ఈ ఎపిసోడ్ గురించి వింటుంటే ఇద్దరూ పక్క వాళ్ళ మీద బరువేసి తాము తేలిగ్గా బయటపడదామనుకుంటున్నారు అనిపిస్తోంది.